Header Banner

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా? నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!

  Sun May 25, 2025 15:05        Entertainment

తన కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని భోజనం చేసే రోజు రావాలని, అందరూ ఆప్యాయంగా కౌగిలించుకుని మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నటుడు మంచు మనోజ్ అన్నారు. ఆ రోజు కోసం దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తన తండ్రి మోహన్ బాబు.. తన కుమార్తెను ఎత్తుకుంటే చూడాలన్నది తన కోరిక అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రంటే తనకెంతో ఇష్టమని, ఆయనపై ఎలాంటి కోపం లేదని స్పష్టం చేశారు. ‘భైరవం’ సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మనోజ్, ఇటీవల చోటుచేసుకున్న కుటుంబ పరిణామాలపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తన తల్లిని చాలా మిస్ అవుతున్నానని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. "అమ్మను కలవాలంటే కొన్ని షరతులు పెట్టారు. ఆమెను కలవడానికి అనుమతి తీసుకోవాలి. లేదంటే నేను వెళ్తే, ఆమె ఇంటి బయటకు వచ్చి నన్ను కలవాలి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు" అని అన్నారు. తన తల్లి కూడా తమను ఎంతగానో మిస్ అవుతోందని, అప్పుడప్పుడు తమ వద్దకు వస్తుంటుందని, తన పాప అంటే అమ్మకు ఎంతో ఇష్టమని చెప్పారు. గొడవల కారణంగా తన సోదరిని కూడా దూరం పెట్టాల్సి వచ్చిందని మనోజ్ తెలిపారు. ఇటీవల ఆమె ఆధ్వర్యంలో జరిగిన ‘టీచ్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమానికి తాను వస్తానో రానో కూడా ఆమెకు తెలియదని, కేవలం ఆమె కోసమే ఆ కార్యక్రమానికి వెళ్లానని అన్నారు.

 

ఇది కూడా చదవండి: ఐదు అసెంబ్లీలకు ఉపఎన్నికలు! షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!

 

"ఇంతకాలం నేను ఏమైపోతానోనని తను ఎంతో భయపడింది. దేవుడి దయ, నా పిల్లలు, అభిమానులు ఇచ్చిన ధైర్యంతో నిలబడ్డాను" అని వివరించారు. కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడుతూ "నీపై ఆధారపడిన కుటుంబం ఉన్నప్పుడు, ఎదుటివాళ్లు కత్తులతో దాడికి వస్తుంటే, నీ ముందు ఒక కత్తి పడి ఉంటే ఏం చేస్తావు? వాళ్లు వచ్చి దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటావా? లేక నీ వాళ్ల కోసం కత్తి ఎత్తుతావా? ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని దెబ్బలైనా తట్టుకోవచ్చు. నా జీవితంలోనూ అదే జరిగింది. ఇప్పుడు నాకంటూ మౌనిక, పిల్లలు ఉన్నారు" అని మనోజ్ తెలిపారు. తన భార్య మౌనిక జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొందని, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిందని, అలాంటి బాధ ఎవరికీ రాకూడదని అన్నారు. ఈ గొడవలతో ఆమెకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆస్తి వివాదాల ఆరోపణలపై కూడా మనోజ్ స్పందించారు. "మేము ఇప్పటివరకు ఆస్తి అడగలేదు. అడిగినట్లు నిరూపించమని సవాల్ చేస్తున్నా. గొడవైన వెంటనే నాపై ఫిర్యాదు చేసి, సీసీటీవీ కెమెరాలను మాయం చేశారు. ఇది ఎప్పుడూ జరిగేదే. ఈసారి అందరికీ తెలియాలనే బయటకు వచ్చి చెప్పాను. నిందలు వేసి, వాటిని నిజమని అంగీకరించమంటే నా వల్ల కాదు. నాక్కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను తప్పు చేస్తే దాక్కుంటాను" అని అన్నారు. సమస్యలను కూర్చొని మాట్లాడుకుందామని, గొడవలు వద్దని తాను అంటున్నానని తెలిపారు. వాళ్లు చేసే పనులకు కోపం రావడం లేదని, బాధగా ఉంటుందని, ఇంత జరిగినా వాళ్లను ప్రేమించడం తప్ప ద్వేషించలేదని మనోజ్ వివరించారు. మంచు మనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘భైరవం’ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ManchuManoj #MohanBabu #Tollywood #Telangana #RangaReddyDistrict